వైరల్‌ : పబ్లిక్‌ చూస్తుండగానే అమ్మాయిపై... | mumbai minor girl thrashed video viral | Sakshi
Sakshi News home page

ముంబైలో బాలికపై యువకుడు దాడి.. అరెస్ట్

Oct 22 2017 8:06 AM | Updated on Oct 22 2017 12:21 PM

mumbai minor girl thrashed video viral

సాక్షి, ముంబై : నగరంలో రెండు రోజుల క్రితం జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో మీడియాలో హైలెట్‌ అయిన విషయం తెలిసిందే. స్థానిక నెహ్రూన‌గ‌ర్‌లో ఓ మైన‌ర్ బాలిక‌పై 19 ఏళ్ల యువ‌కుడు దాడి చేయగా.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా అది బయటకు వచ్చింది.

శుక్రవారం రాత్రి న‌డిరోడ్డుపై అంద‌రూ చూస్తుండ‌గా పిడిగుద్దులు కురిపించాడు. దీంతో ఆమె అక్క‌డే స్పృహ కోల్పోయింది. వెంటనే స్థానికులు అతన్ని నిలువరించి.. ఆ అమ్మాయిని ఘ‌ట్కోపార్‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించి, చికిత్స అందించారు. అమ్మాయి ముక్కుకు గాయం అయ్యింది. దాడి అనంతరం యువకుడు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాలు అక్క‌డి సీసీ కెమెరాలో రికార్డు కాగా, ఆ వీడియో మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశాడు.

కుర్లా ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ షాహిద్ షైక్ అనే యువ‌కుడు ఆమె ఇంటి దగ్గరే ఉంటున్నాడు. తనతో మాట్లాడాలని.. ఇష్టపడుతున్నానంటూ వేధించసాగాడు. అయితే అందుకు యువతి అంగీకరించకపోవటంతో కాపుకాసి ఇలా దాడికి పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తేలింది. అయితే దాడి జరుగుతున్న సమయంలో పక్కనే చాలా మంది ఉన్నప్పటికీ.. స్పందించేలోపే యువకుడు దాడికి పాల్పడ్డాడు.

నడిరోడ్డులో బాలికపై దాడిచేసిన  సీసీ కెమెరా ఫుటేజ్ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement