15 మంది మావోయిస్టుల మృతి | more than 15 maoists dead in crossfire with police in chhattisgarh | Sakshi
Sakshi News home page

15 మంది మావోయిస్టుల మృతి

Dec 8 2015 7:36 PM | Updated on May 29 2018 11:17 AM

15 మంది మావోయిస్టుల మృతి - Sakshi

15 మంది మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో 15 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు.

ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో 15 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. ఎస్టీఎఫ్, డీఆర్‌జీ జిల్లా పోలీసులతో కూడిన సంయుక్త దళం వెళ్తుండగా, టేటేమడుగు సమీపంలో వారికి మావోయిస్టులు ఎదురుపడ్డారు. రెండువైపులా జరిగిన కాల్పుల్లో 15 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు. వారి మృతదేహాలను తీసుకుని పోలీసులు దాదాపు 16 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వస్తుండగా, మధ్యలో మరోసారి మావోయిస్టులు.. పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. దాంతో ఐదుగురు జవాన్లకు గాయాలయ్యాయి. వాళ్లను హెలికాప్టర్ ద్వారా రాజధాని రాయ్‌పూర్‌కు తరలించారు.

దాదాపు 250 మంది జవాన్లతో కూడిన బృందం టేటేమడుగు సమీపంలోకి వెళ్లినప్పుడు అక్కడ 150 మంది మావోయిస్టులు 300 మంది స్థానికులను రక్షణగా పెట్టుకుని దాడి చేశారని, జవాన్ల కాల్పుల్లో 15 మంది వరకు మావోయిస్టులు  మరణించారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement