మోదీ, మమత దొందూదొందే! | Modi, Mamata are same to same | Sakshi
Sakshi News home page

మోదీ, మమత దొందూదొందే!

Apr 14 2016 2:44 AM | Updated on Oct 22 2018 9:16 PM

మోదీ, మమత దొందూదొందే! - Sakshi

మోదీ, మమత దొందూదొందే!

తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్‌లో అరాచక పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ ఆరోపించారు.

సోనియా గాంధీ ధ్వజం
 
 సుజాపూర్: తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ  పశ్చిమబెంగాల్‌లో అరాచక పాలన సాగిస్తున్నారని  కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ ఆరోపించారు. ప్రధాని మోదీ, మమతలది ఒకే తీరని దుయ్యబట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పేదలు, మైనారిటీ వర్గాలకు ఇచ్చిన హామీలను మమత నిలబెట్టుకోలేదని విమర్శించారు. బుధవారం బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

‘బెంగాల్‌లో మహిళ సీఎంగా ఉన్నా మహిళలపై అకృత్యాలు ఆగడం లేదు. రైతుల పంటలకు న్యాయమైన ధరల్లేవు. పేదలకు ఉపాధి లేదు. కేంద్రంలో మోదీ, ఇక్కడ మమత ఇద్దరూ కలసి జనాన్ని మోసగించారు. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం కష్టాల్లో ఉన్నప్పుడు తృణమూల్ ఆదుకుంటుంది. అందుకు బదులుగా మమత తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను కేంద్రం చూసీచూడకుండా వదిలేస్తుంది’ అని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement