మమత ప్రమాణానికి ఆ ఇద్దరు! | PM Modi, Sonia likely to attend Mamata Banerjee oath ceremony on May 27 | Sakshi
Sakshi News home page

మమత ప్రమాణానికి ఆ ఇద్దరు!

May 21 2016 4:14 PM | Updated on Oct 22 2018 9:16 PM

మమత ప్రమాణానికి ఆ ఇద్దరు! - Sakshi

మమత ప్రమాణానికి ఆ ఇద్దరు!

మరోసారి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారోత్సవానికి రంగం సిద్ధమైంది.

కోల్‌కతా: మరోసారి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారోత్సవానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంరగంగ వైభవంగా ఈ నెల 27న ప్రమాణ వేడుకలో మరోసారి సీఎం పదవి చేపట్టేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. కోల్‌కతాలో జరుగబోయే ఈ వేడుక కోసం రాజకీయ అతిరథ మహారథులను, పారిశ్రామికవేత్తలను, సినీ స్టార్స్‌ను అతిథులుగా పిలువనున్నట్టు తెలుస్తోంది.

కోల్‌కతాలోని రెడ్‌ రోడ్డులో అట్టహాసంగా జరుగబోయే బహిరంగ ప్రమాణ స్వీకార వేడుకకు 8వేల నుంచి 10వేల వరకు అతిథులు రానున్నారని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ వేడుకకు ఆహ్వానిస్తున్న ముఖ్య అతిథుల్లో ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఉన్నారు. అలాగే బిహార్‌, యూపీ, ఢిల్లీ, మహారాష్ట్ర సీఎంలు నితీశ్‌కుమార్‌, అఖిలేశ్  యాదవ్‌, అరవింద్ కేజ్రీవాల్‌, దేవేంద్ర ఫడ్నవిస్‌లను కూడా ఆహ్వానిస్తున్నారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన తనయుడు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ కూడా అతిథుల జాబితాలో ఉన్నారు. కేంద్రమంత్రులు అరుణ్‌ జైట్లీ, వెంకయ్యనాయుడులకు కూడా ఆహ్వానం అందనుంది. ఇప్పటికే లాలూ, సోనియా, నితీశ్‌లకు మమత వ్యక్తిగతంగా ఫోన్‌ చేసి ఆహ్వానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement