జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు భద్రత సిబ్బందిపై దాడి చేశారు.
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు భద్రత సిబ్బందిపై దాడి చేశారు. పుల్వామా జిల్లాలో పొహులో పెట్రోలింగ్కు వెళ్లిన జవాన్లపై గ్రెనైడ్లు విసిరారు. ఈ ఘటనలో ఒక సీఆర్పీఎఫ్ అధికారి మరణించారు. మరో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు సహా ఆరుగురికి గాయలయ్యాయి.