చార్జీంగ్‌.. హెడ్‌సెట్లో పాటలు.. షాక్‌ | Man Dies With Current Shock While Listening Songs On Mobile At Chandigarh | Sakshi
Sakshi News home page

Jun 7 2018 1:11 PM | Updated on Jun 7 2018 1:11 PM

Man Dies With Current Shock While Listening Songs On Mobile At Chandigarh - Sakshi

చండీగడ్‌ : మొబైల్‌ ఫోన్‌కు చార్జీంగ్‌ పెట్టి, హెడ్‌ సెట్లో పాటలు వింటున్న యువకుడు షాక్‌ కొట్టి చనిపోయాడు. ఈ సంఘటన బుధవారం హర్యానా రాష్ట్రంలోని యముననగర్‌ జిల్లా పాండ్యో గ్రామంలో చోటు చేసుకుంది. తాత్‌సింగ్‌ (22) అనే యువకుడు తన ఇంట్లో ఫోన్‌కు చార్జీంగ్‌ పెట్టి అలానే హెడ్‌ఫోన్‌ పెట్టుకుని పాటలు వింటున్నాడు. ఆ సమయంలో ఇంట్లో విద్యుత్‌ సరఫరా లేదు. కరెంటు వచ్చే సమయానికి చార్జీంగ్‌ కేబుల్‌ అలానే ఉండడంతో తాత్‌సింగ్‌ కరెంటు షాక్‌కు గురైయ్యాడు. దాంతో ఇంట్లో వాళ్లు అతడ్ని యముననగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువకుడు మరణించాడు. 

Advertisement
 
Advertisement
Advertisement