'మమ్మల్ని ఎదిరిస్తే.. కళ్లు పీకేసి, చేతులు నరికేస్తాం' | Mamata's nephew Abhishek Banerjee | Sakshi
Sakshi News home page

'మమ్మల్ని ఎదిరిస్తే.. కళ్లు పీకేసి, చేతులు నరికేస్తాం'

Jun 23 2015 9:31 AM | Updated on Sep 3 2017 4:15 AM

'మమ్మల్ని ఎదిరిస్తే.. కళ్లు పీకేసి, చేతులు నరికేస్తాం'

'మమ్మల్ని ఎదిరిస్తే.. కళ్లు పీకేసి, చేతులు నరికేస్తాం'

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తృణమాల్ కాంగ్రెస్ పాలనను ఎవరైనా ఎదిరిస్తే చేస్తే వారి కళ్లు పీకేసి, చేతులు నరికేస్తామని అభిషేక్ అన్నారు.

తృణమాల్ కాంగ్రెస్ యూత్ విభాగం అధ్యక్షుడైన అభిషేక్ పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ తృణమాల్ వ్యతిరేకులపై నిప్పులు చెరిగారు. బెంగాల్ ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి మమతా బెనర్జీ,  తృణమాల్ కాంగ్రెస్ శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నారని అన్నారు. మమ్మల్ని ఎవరైనా ధిక్కరిస్తే వారి కళ్లు పీకేస్తామని హెచ్చరించారు. రోడ్డు మీదకు ఈడ్చి చేతులు నరికేస్తామని చెప్పారు. ఇదిలావుండగా, గత జనవరిలో ఓ ర్యాలీ సందర్భంగా ఓ యువకుడు అభిషేక్ను చెంపదెబ్బ కొట్టాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement