నగర శివారులోని మంగోల్పురిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
న్యూఢిల్లీ: నగర శివారులోని మంగోల్పురిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులలో అయిదేల్ల బాలిక కూడా ఉంది. మరో 15 మంది గాయపడ్డారు. మృతులను బాలిక గాయత్రి, సురేఖగా గుర్తించారు. భవనంలో చెలరేగిన మంటలు పక్కన మరో రెండు ఇళ్లకు కూడా అంటుకున్నాయి.
విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసింది. సాయంత్రం 4 గంటల సమయంలో ఈ భవనంలో మంటలు ఎగిసిపడినట్లు అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. ఈ భవనంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ముల కుటుంబాలు ఉన్నట్లు తెలిపారు. గాయపడిన వారిని సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి, సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు.