
►నేటి నుంచి లాక్‌డౌన్ 5.0లో మరిన్ని సడలింపులు
♦ దేశవ్యాప్తంగా తెరచుకోనున్న ఆలయాలు
♦ నేటి నుంచి హోటళ్లు , రెస్టారెంట్లు, షాపింగ్స్ మాల్స్ ప్రారంభం
♦ థియేటర్లు, బార్లు, మెట్రోరైళ్లు, స్విమ్మింగ్‌పూల్స్, జిమ్‌లపై నిషేదం
♦ పార్కులు, సభలు, సమావేశాలపై నిషేదం
ఆంధ్రప్రదేశ్: దేవాలయాల్లో నేటి నుంచి ట్రయల్ రన్
హైదరాబాద్: తెలంగాణలో నేటి నుంచి తెరుచుకోనున్న ఆలయాలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్
♦ కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో తెరిచేందుకు అనుమతి
♦ గేమింగ్ సెంటర్లు, సినిమా హాళ్లపై కొనసాగనున్న నిషేదం
♦ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి
విశాఖపట్నం: సింహాచలం లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి సర్వం సిద్ధం
♦ నేడు, రేపు దేవాలయ సిబ్బంది, స్థానికులతో ట్రయల్‌రన్
♦ 10వ తేదీ నుంచి లక్షీనరసింహస్వామి దర్శనానికి భక్తులకు అనుమతి