నోట్ల రద్దుతో దీర్ఘకాలంలో లాభం | Long term profit with the termination of banknotes | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దుతో దీర్ఘకాలంలో లాభం

Sep 4 2017 2:25 AM | Updated on Sep 27 2018 9:08 PM

ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం దీర్ఘకాలంలో దేశానికి లాభిస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌

ఆరెస్సెస్‌ వెల్లడి  
 
బృందావన్‌: ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం దీర్ఘకాలంలో దేశానికి లాభిస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌) ప్రచార్‌ ప్రముఖ్‌ మన్మోహన్‌ వైద్య తెలిపారు. అరెస్సెస్‌ సమన్వయ కమిటీ నిర్వహించిన 3 రోజుల సమావేశాలు ఆదివారంతో ముగిసిన నేపథ్యంలో వైద్య మీడియాతో మాట్లాడారు. డోక్లామ్‌లో చైనా వెనక్కు తగ్గడంతో భారతదేశం, సైన్యం ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయికి చేరుకుందని వైద్య ప్రశంసించారు.

గతంలోనూ చైనా డోక్లామ్‌ తరహా ఘటనలకు పాల్పడినప్పటికీ, భారత్‌ ఈ స్థాయిలో ప్రతిస్పందించడం మాత్రం ఇదే మొదటిసారన్నారు. గతంలో ఆరెస్సెస్‌ శ్రేణులే నోట్ల రద్దును విమర్శించాయని, కానీ దీర్ఘకాలంలో నోట్ల రద్దు దేశానికి లబ్ధి చేకూరుస్తుందని ఇప్పుడు ప్రజలందరూ అర్థం చేసుకున్నారని వైద్య వెల్లడించారు. విదేశీ వస్తువులను బహిష్కరించాలన్న తమ విధానంలో ఎలాంటి మార్పు లేదని మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఈ సదస్సులో ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, యూపీ సీఎం యోగి పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement