దాడి చేస్తుంటే...ఆత్మరక్షణ కోసమే పెప్పర్ స్ప్రే | lagadapati rajagopal used Pepper Spray for self-defense, says Harsha kumar | Sakshi
Sakshi News home page

దాడి చేస్తుంటే...ఆత్మరక్షణ కోసమే పెప్పర్ స్ప్రే

Feb 13 2014 12:36 PM | Updated on Mar 9 2019 3:59 PM

ఆత్మరక్షణ కోసమే లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్పే చేశారని ఎంపీ హర్షకుమార్ తెలిపారు.

న్యూఢిల్లీ : ఆత్మరక్షణ కోసమే లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్పే చేశారని ఎంపీ హర్షకుమార్ తెలిపారు. టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై దాడి చేస్తూంటే తాము అడ్డుకున్నామన్నారు. ఈ సందర్భంగా లగడపాటిపౌ దాడికి యత్నించిన సమయంలో ఆత్మరక్షణ కోసమే పెప్పర్ స్పే ఉపయోగించారని హర్షకుమార్ అన్నారు.

తమ దగ్గర ఉన్న ఆయుధం అదొక్కటేనని... ప్రజల కోసమే తాము అలా చేశామని ఆయన పేర్కొన్నారు. లోక్సభ విజువల్స్ బయటపెట్టాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. మరోవైపు లగడపాటి పెప్పర్  స్పే చేయటంతో పలువురు ఎంపీలకు దగ్గు, కళ్ల నుంచి నీళ్ళు రావటంతో భయంతో బయటకు పరుగులు తీశారు. అస్వస్థతకు గురైన ఎంపీలను సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement