కృష్ణా జలాల కేసు మరో బెంచ్‌కు.. | krishna river water case transferred to another bench | Sakshi
Sakshi News home page

కృష్ణా జలాల కేసు మరో బెంచ్‌కు..

Nov 11 2014 1:57 AM | Updated on Jun 4 2019 6:33 PM

కృష్ణా జలాల కేసు మరో బెంచ్‌కు.. - Sakshi

కృష్ణా జలాల కేసు మరో బెంచ్‌కు..

తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మరో బెంచ్‌కు బదిలీ అయ్యింది.

 ‘నాట్ బిఫోర్ మి’ అన్న జస్టిస్ ముఖోపాధ్యాయ, జస్టిస్ ఎన్.వి. రమణ ధర్మాసనం
 
 సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నది జలాల వివాదానికి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మరో బెంచ్‌కు బదిలీ అయ్యింది. ఆ పిటిషన్‌ను విచారించేందుకు జస్టిస్ ఎస్.జె.ముఖోపాధ్యాయ, జస్టిస్ ఎన్.వి.రమణతో కూడిన ధర్మాసనం నిరాకరించి, మరో బెంచ్‌కు బదిలీ చేయాల్సిందిగా రిజిస్ట్రార్‌కు సూచించింది. కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును గెజిట్‌లో ప్రచురించరాదని.. నికర, మిగులు జలాల లెక్కలు తేల్చాకే తిరిగి పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం తన పిటిషన్‌లో కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? అన్న అంశంపై సోమవారం విచారణ సందర్భంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే జస్టిస్ ఎన్వీ రమణ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు కాబట్టి.. ఈ పిటిషన్‌ను విచారించేందుకు సుముఖత చూపలేదు. దీంతో ధర్మాసనం ‘నాట్ బిఫోర్ మి’గా పేర్కొంటూ.. ఈ కేసును మరో బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఈ మేరకు పిటిషన్ మరో బెంచ్‌కు బదిలీ కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement