అందాన్ని ఇవ్వలేని సబ్బు.. పరిహారం ఇచ్చింది | Kerala man sues Mammootty, soap brand; gets Rs 30,000 as compensation | Sakshi
Sakshi News home page

అందాన్ని ఇవ్వలేని సబ్బు.. పరిహారం ఇచ్చింది

Jan 19 2016 4:20 PM | Updated on Sep 3 2017 3:55 PM

అందాన్ని ఇవ్వలేని సబ్బు.. పరిహారం ఇచ్చింది

అందాన్ని ఇవ్వలేని సబ్బు.. పరిహారం ఇచ్చింది

మా ప్రోడక్ట్ వాడి అందంగా మారండి అంటూ ఉదరగొట్టే యాడ్లను రోజూ చూస్తూనే ఉంటాం.

తిరువనంతపురం: మా ప్రొడక్ట్ వాడి అందంగా మారండి అంటూ ఉదరగొట్టే యాడ్లను రోజూ చూస్తూనే ఉంటాం. అవి అన్ని వట్టి మాటలే అనే విషయం మనకూ తెలుసు. కానీ, ఓ యాడ్ను సీరయస్గా తీసుకున్నచాతూ అనే శిల్పి ఏకంగా ఓ సబ్బును సంవత్సరం పాటూ వాడాడు. అయినా అతను ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో విసిగిపోయిన అతను ఏకంగా ఆ యాడ్లో నటించిన మలయాళ మెగాస్టార్ మమ్మూట్టీ, సదరు సంస్థపై 2015 సెప్టెంబర్లో వాయానంద్లోని  వినియోగదారుల కోర్టులో కేసు పెట్టాడు.

దీంతో చాతూకు, ఇందులేఖ సంస్థ రూ.30,000లు పరిహారంగా ఇవ్వడానికి అంగీకరించింది. సమాజంలో ఎంతో పలుకుబడి ప్రభావం ఉన్న మమ్మూట్టీ నటించిన ఇందులేఖ సబ్బు యాడ్ను చూసి ఆ సబ్బును వాడానని కానీ, కొంచెం కూడా మార్పు రాలేదని చాతూ తెలిపాడు.

ఇందులేఖ సబ్బు ట్యాగ్లైన్- 'సౌందర్యం నిన్గలే తేడి వరుం' (అందం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది) అనే విషయాన్ని కూడా కోర్టు వాదనల సందర్భంగా సంస్థ ప్రతినిధులను ప్రశ్నించింది. దీంతో కేసుపై ఏమీ వాదించకుండానే ఆ వ్యక్తికి పరిహారం చెల్లించడానికి ఆ సంస్థ అంగీకరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement