కర్ణాటక విధాన సౌధలో నీలి చిత్రాల హవా! | Karnataka Vidhana Soudha staff watch blue films on duty | Sakshi
Sakshi News home page

కర్ణాటక విధాన సౌధలో నీలి చిత్రాల హవా!

Aug 23 2013 5:17 AM | Updated on Sep 1 2017 10:01 PM

కర్ణాటకలోని ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు ఉద్యోగులు పని ఎగ్గొట్టి మరీ ‘అశ్లీల సైట్లు’ చూస్తున్నారని సీఐడీకి సీబీఐ సమాచారమిచ్చింది. విధాన సౌధలో ఈ పోకడ ఎక్కువగా కనిపించిందని పేర్కొంది.

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు ఉద్యోగులు పని ఎగ్గొట్టి మరీ ‘అశ్లీల సైట్లు’ చూస్తున్నారని సీఐడీకి సీబీఐ సమాచారమిచ్చింది. విధాన సౌధలో ఈ పోకడ ఎక్కువగా కనిపించిందని పేర్కొంది. సీబీఐలోని సైబర్ నిపుణులు ఉగ్రవాద వ్యతిరేక నిఘా వేసినప్పుడు ఈ విషయం బయటపడింది. విధాన సౌధలో నీలి చిత్రాల వీక్షణ గురించి సీఐడీకి ఎప్పటికప్పుడు సీబీఐ సమాచారం చేరవేసినట్లు తెలిసింది. దీనిపై సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ, ఈ విషయమై తన వద్ద స్పష్టమైన సమాచారం లేదన్నారు. కార్యాలయాల్లో నీలి చిత్రాలను చూస్తే చర్యలు చేపడతామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement