బోఫోర్స్‌ బెంచ్‌ నుంచి తప్పుకున్నారు | Justice Khanwilkar recuses himself from Bofors case | Sakshi
Sakshi News home page

బోఫోర్స్‌ బెంచ్‌ నుంచి తప్పుకున్నారు

Feb 14 2018 2:47 AM | Updated on Sep 2 2018 5:18 PM

జస్టిస్‌ ఖన్వీల్కర్‌  - Sakshi

న్యూఢిల్లీ: బోఫోర్స్‌ కేసును విచారిస్తోన్న సుప్రీం కోర్టు బెంచ్‌ నుంచి జడ్జి జస్టిస్‌ ఖన్వీల్కర్‌ తప్పుకున్నారు. సీజేఐ జస్టిస్‌ మిశ్రా, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనంలో భాగంగా ఉన్న ఆయన తన నిర్ణయానికి సంబంధించి ఎలాంటి కారణాల్ని పేర్కొనలేదు.

రూ. 64 కోట్ల బోఫోర్స్‌ కుంభకోణం కేసులో అన్ని ఆరోపణల్ని కొట్టివేస్తూ 2005లో ఢిల్లీ హైకోర్టు తీర్పునివ్వగా దానిని సవాలు చేస్తూ బీజేపీ నేత అగర్వాల్‌  కోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న సీబీఐ ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ కేసులో పిటిషన్‌ దాఖలు చేసేందుకున్న అర్హతేంటో చెప్పాలని అగర్వాల్‌ను కోర్టు ఆదేశించింది. ఆ అంశంపై ధర్మాసనం మంగళవారం విచారించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement