
జెట్ కారు @880 కి.మీల స్పీడు
బయల్దేరిన రెండు గంటల్లోపే ముంబై నుంచి న్యూఢిల్లీకి చేరుకోవాలంటే ఈ అధునాతన జెట్ కారు ఎక్కాల్సిందే.
బయల్దేరిన రెండు గంటల్లోపే ముంబై నుంచి న్యూఢిల్లీకి చేరుకోవాలంటే ఈ అధునాతన జెట్ కారు ఎక్కాల్సిందే. ఎందుకంటే ఈ జెట్ కారు స్పీడు గంటకు 880 కిలోమీటర్లు. జీఎఫ్7గా పిలవడే ఈ అసాధారణ వాహనాన్ని తయారుచేయాలనే ఆలోచన అమెరికాకు చెందిన గ్రెగ్ బ్రౌన్, డేవ్ ఫాసెట్ అనే ఇద్దరు ఇంజనీర్లకు వచ్చింది. 3,500 పౌండ్ల పీడన సామర్థ్యముండే టర్భైన్ ఇంజిన్‌ను బిగించడం ద్వారా ఇంతటి స్పీడు సాధ్యమని వీరు చెబుతున్నారు.
జెట్ కారు టేకాఫ్ కోసం ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వేతో పనేలేదు. చక్కని రహదారి చాలు. గంటకు 160 కిలోమీటర్ల స్పీడుతో టేకాఫ్ అయ్యాక 38,000 అడుగుల ఎత్తులో గంటకు 880 కిలోమీటర్ల స్పీడుతో జెట్ కారు దూసుకుపోతుంది. ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న ఈ వాహన నమూనాను వచ్చే నాలుగేళ్లలో ఆవిష్కరిస్తామని ఇంజనీర్లు ప్రకటించారు.