ఉగ్రవాదిగా మారిన ఐపీఎస్‌ సోదరుడు..!

Jammu IPS Officer Missing Brother May Joined In Militancy - Sakshi

శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌కు చెందిన యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపించడానికి ఉగ్ర సంస్థలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాయి. తాజాగా ఓ ఐపీఎస్‌ అధికారి సోదరుడు ఉగ్రవాదుల్లో చేరినట్టు వెలువడుతున్న వార్తలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. జమ్ముకశ్మీర్‌కు వెలుపల సేవల అందిస్తున్న ఆ ఐపీఎస్‌ అధికారి సోదరుడు షామ్సుల్‌ హక్‌ మే 26వ తేదీన అదృశ్యమయ్యాడు. దక్షిణ కశ్మీర్‌లోని షోఫియాన్‌ జిల్లాకు చెందిన షామ్సుల్‌ ప్రభుత్వ కళాశాల నుంచి బీయూఎంస్‌ పట్టా పొందాడు. 

అయితే షామ్సుల్‌ అదృశ్యమైనప్పటి నుంచి ఇప్పటివరకు అతని గురించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో అతను తీవ్రవాదం వైపు ఆకర్షితుడైనట్టు అనుమానాలు బలపడుతున్నాయి. కాగా షోఫియాన్‌ ఎస్‌ఎస్‌పీ మాత్రం దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. షామ్సుల్‌ మిస్సింగ్‌ గురించి కుటుంబసభ్యులు నుంచి ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. వారు ఫిర్యాదు చేస్తే తాము అధికారికంగా విచారించే అవకాశం ఉంటుందన్నారు. 2017లో 126 మంది యువకులు ఉగ్రవాదం వైపు అకర్షితులైనట్టు అధికారులు వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top