తమిళనాడులో జల్లికట్టుకు నలుగురి బలి | Jallikattu death toll reaches 4 as more spectators killed in Tamil Nadu | Sakshi
Sakshi News home page

తమిళనాడులో జల్లికట్టుకు నలుగురి బలి

Jan 17 2018 4:05 AM | Updated on Jan 17 2018 4:05 AM

Jallikattu death toll reaches 4 as more spectators killed in Tamil Nadu - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై/చంద్రగిరి: సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో నిర్వహించిన జల్లికట్టు కార్యక్రమంలో గత మూడు రోజుల్లో నలుగురు మరణించారు. 15వ తేదీ పాలమేడులో జల్లికట్టు సందర్భంగా ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్న యువకుడు ఎద్దు పొడవడంతో మృతిచెందాడు. తిరుచిరాపల్లి మనకోట్టైలో మంగళవారం జరిగిన జల్లికట్టులో ఎద్దు పొడవడంతో ఒక వ్యక్త చనిపోయాడు.

శివగంగై జిల్లా శిరవయల్‌లో మంగళవారం మంజువిరాట్‌ పోటీల సందర్భంగా ఎద్దులను వదలగా అవి ప్రేక్షకుల్లోకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 50 మంది గాయపడ్డారు. కాగా,మదురై జిల్లా అలంగనల్లూరులో క్రీడా పోటీలను సీఎం పళనిస్వామి ప్రారంభించారు. విజేతలకు కారు, బంగారు నాణేలు తదితర రూ.కోటి విలువైన ఆకర్షణీయ బహుమతులు ప్రకటించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement