జకీర్‌కు మలేసియా ఆశ్రయం

Islamic Preacher Zakir Naik Finds Refuge in Malaysia as Politicised .. - Sakshi

కౌలాలంపూర్‌: వివాదాస్పద మత ప్రచారకుడు జకీర్‌ నాయక్‌ (52)కు మలేసియా ప్రభుత్వం శరణార్థిగా దేశంలోకి అనుమతించింది. ఇక్కడి పుత్ర మసీదు(మస్జీద్‌ పుత్ర) నుంచి జకీర్‌ తన అంగరక్షకుడితో కలిసి బయటికొస్తున్న వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ మసీదులోనే ఆ దేశ ప్రధాని నజీబ్‌ రజాక్‌ సహా పలువురు కేబినెట్‌ మంత్రులు ప్రార్థనల్లో పాల్గొంటారు. 2018, జూన్‌లో జరిగే ఎన్నికల్లో దేశంలోని మెజారిటీ మలయా ముస్లింల ఓట్లను దక్కించుకునేందుకు రజాక్‌ ఈ చర్య తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ విషయమై ఆ దేశ ఉపప్రధాని అహ్మద్‌ జహీద్‌ పార్లమెంటులో మాట్లాడుతూ.. జకీర్‌ ఐదేళ్ల క్రితమే మలేసియాలో శాశ్వత నివాసం కోసం అనుమతి పొందారని తెలిపారు. జకీర్‌ అప్పగింతపై భారత్‌ నుంచి ఎలాంటి విజ్ఞప్తులు అందలేదన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top