breaking news
Malaysian government
-
జకీర్‌కు మలేసియా ఆశ్రయం
కౌలాలంపూర్: వివాదాస్పద మత ప్రచారకుడు జకీర్ నాయక్ (52)కు మలేసియా ప్రభుత్వం శరణార్థిగా దేశంలోకి అనుమతించింది. ఇక్కడి పుత్ర మసీదు(మస్జీద్ పుత్ర) నుంచి జకీర్ తన అంగరక్షకుడితో కలిసి బయటికొస్తున్న వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఈ మసీదులోనే ఆ దేశ ప్రధాని నజీబ్ రజాక్ సహా పలువురు కేబినెట్ మంత్రులు ప్రార్థనల్లో పాల్గొంటారు. 2018, జూన్‌లో జరిగే ఎన్నికల్లో దేశంలోని మెజారిటీ మలయా ముస్లింల ఓట్లను దక్కించుకునేందుకు రజాక్ ఈ చర్య తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ విషయమై ఆ దేశ ఉపప్రధాని అహ్మద్ జహీద్ పార్లమెంటులో మాట్లాడుతూ.. జకీర్ ఐదేళ్ల క్రితమే మలేసియాలో శాశ్వత నివాసం కోసం అనుమతి పొందారని తెలిపారు. జకీర్ అప్పగింతపై భారత్ నుంచి ఎలాంటి విజ్ఞప్తులు అందలేదన్నారు. -
భారతీయ పర్యాటకులకు మలేషియా వీసా సులభతరం
కౌలాలంపూర్: మలేషియా ప్రభుత్వం భారతీయ, చైనీయుల వీసాలపై ఆంక్షలను సడలించింది. 2014 సంవత్సరంలో మలేషియా పర్యటనకు వెళ్లే భారత పర్యాటకులు సహా చైనీయులు సందర్శించేందుకు వీలుగా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అహ్మద్ జహిద్ హమీది పేర్కొన్నారు. వీసా ఆన్ ఆరైవల్ (వీఓఎ) అనే విధానం ద్వారా భారతీయులకూ, చైనీయులకూ మలేషియా ప్రభుత్వం ఈ వెసులుబాటును కల్పిస్తోంది. ప్రస్తుతం పాస్ ఫోర్ట్ కలిగివున్న భారతీయులు, చైనీయులు తమ పర్యటనకు ముందు వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. 2010లో మలేషియా ప్రభుత్వం పర్యాటకుల కోసం ప్రత్యేకంగా భారతీయులుకూ, చైనీయులతోపాటు ఎనిమిది దేశాలకూ వీఒఎ అనే విధానం ద్వారా ఈ అవకాశాన్ని కల్పించింది. దీంతో వేలాదిమందికిపైగా పర్యాటకులు మలేషియాను సందర్శించి ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నట్టు వెల్లడించింది. ఈ విఒఎ సౌకర్యాన్ని 2006లో ప్రవేశపెట్టారు. కాగా, ఇమ్మిగ్రేషన్ విభాగం రిపోర్ట్ ప్రకారం.. భారతీయులు 39,000 మంది, చైనీయులు 6,000 మంది పౌరులు మలేషియాకు సందర్శించినట్టు పేర్కొంది.