ఇండియన్‌ షిప్‌ హైజాక్‌ | Indian cargo ship hijacked by Somali pirates with 11 onboard | Sakshi
Sakshi News home page

ఇండియన్‌ షిప్‌ హైజాక్‌

Apr 3 2017 9:21 AM | Updated on Sep 5 2017 7:51 AM

ఇండియన్‌ షిప్‌ హైజాక్‌

ఇండియన్‌ షిప్‌ హైజాక్‌

11 మంది సిబ్బందితో వెళ్తున్న ఇండియన్‌ కార్గో షిప్‌ హైజాక్‌కు గురైంది

న్యూఢిల్లీ: ఇండియన్‌ కార్గో షిప్‌ హైజాక్‌కు గురవడం కలకలం రేపుతోంది. 11 మంది సిబ్బందితో షిప్‌ దుబాయ్‌ నుంచి యెమెన్‌ వెళ్తుండగా.. సోమాలియా సముద్రపు దొంగలు దాడి చేసి హైజాక్‌ చేశారు. ఏప్రిల్‌ 1న షిప్‌ హైజాక్‌కు గురైనట్లు అధికారులు నిర్థారించారు.

సముద్రపు దొంగల చేతిలో బంధీలుగా ఉన్న 11 మంది కూడా ముంబైలోని మాండ్వీ ప్రాంతానికి చెందిన వారని సమాచారం. హైజాక్‌ విషయాన్ని షిప్‌ కెప్టెన్‌ దుబాయ్‌లోని అధికారులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ హైజాక్‌ ఘటనను ధృవీకరించింది. షిప్‌లోని సిబ్బందిని రక్షించడానికి చర్యలు చేపడుతున్నట్లు భారత నేవీ అధికారులు వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement