భారత ఆర్మీకి ‘నాగ్‌’ శక్తి

Indian Army To Induct 300 Nag Missiles - Sakshi

న్యూఢిల్లీ : 300 నాగ్‌ యాంటీ ట్యాంక్‌ మిస్సైల్స్‌ను భారతీయ ఆర్మీ తీసుకోనుంది. 6-7 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు దేశాల యుద్ధట్యాంకులను నాగ్‌ క్షిపణి నాశనం చేయగలదు. 1980వ దశకంలో 5 రకాల క్షిపణులను భవిష్యత్‌ అవసరాల కోసం అభివృద్ధి చేయాలని భారత్‌ భావించింది. వాటిలో నాగ్‌ క్షిపణి కూడా ఒకటి.

అయితే, ఆ తర్వాత పలు రకాల కారణాల వల్ల నాగ్‌ క్షిపణుల అభివృద్ధి ఆలస్యం అవుతూ వచ్చింది. రక్షణ శాఖ అధికారుల సమాచారం మేరకు 300 నాగ్‌ క్షిపణులు, 25 నాగ్‌ మిస్సైల్‌ కారియర్స్‌(నామికా)ను భారత ఆర్మీ తీసుకోనుంది. నామికా ద్వారా ఒకేసారి ఆరు నాగ్‌ క్షిపణులను ప్రయోగించొచ్చు.

నాగ్‌ క్షిపణుల పరీక్షించిన తర్వాత ఆర్మీ 3 వేల క్షిపణులను తీసుకునే అవకాశం ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా శత్రు యుద్ధట్యాంకులను నాశనం చేయగల సామర్ధ్యం నాగ్‌ మిస్సైల్స్‌ సామర్ధ్యం. అందుకే వీటిని ఫైర్‌ అండ్‌ ఫర్గెట్‌ క్షిపణి అంటారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top