'ఎలాగైనా నా కొడుకు మృతదేహాన్ని అప్పగించండి' | I want my child back, says woman whose son's missing in Mandi of Himachal Pradesh | Sakshi
Sakshi News home page

'ఎలాగైనా నా కొడుకు మృతదేహాన్ని అప్పగించండి'

Jun 10 2014 5:31 PM | Updated on Sep 2 2017 8:35 AM

'నా కొడుకును అప్పగించండి' అంటూ ఐసా హుస్సేన్ అనే మహిళ హిమాచల్ ప్రదేశ్ అధికారులతో మొరపెట్టుకున్నారు.

మండి: 'నా కొడుకును అప్పగించండి' అంటూ ఐసా హుస్సేన్ అనే మహిళ హిమాచల్ ప్రదేశ్ అధికారులతో మొరపెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తన కుమారుడి శవాన్ని వెతికి తీసుకురావాలని.. నా కుమారుడి మృతదేహాన్ని అప్పగించాలని మీడియా ఏజెన్సీతో ఆవేదన వ్యక్తం చేశారు.
 
హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలోని బియాస్ నదిలో కొట్టుకుపోయిన విద్యార్ధుల తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
నా కుమారుడు మంచి ఈతగాడు.. నదిలో ఎలా కొట్టుకుపోయాడో అర్ధం కావడం లేదని మరో విద్యార్ధి తండ్రి బీవీ సుబ్బారావు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ దుర్ఘటనలో మరణించిన విద్యార్ధులందరూ తెలివైన వారేనని సుబ్బారావు అన్నారు.
 
టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ సమయంలో కూడా మృత దేహాల వెలికితీతకు గజ ఈతగాళ్లపై ఆధారపడి ఉండటం చాలా దారుణమన్నారు. నీటిలోపల ఉండే వాటిని తేలికగా గుర్తు పట్టేందుకు ఎన్నో సాధనాలున్నాయన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement