అయోధ్య కేసు : సుప్రీంలో హైడ్రామా

High Drama Erupts In Supreme Court Over Ayodhya Case - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టులో బుధవారం విచారణ చివరి రోజు హైడ్రామా నెలకొంది. ఉదయం నుంచే కోర్టులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తన వాదనకు మద్దతుగా హిందూ మహాసభ న్యాయవాది న్యాయస్ధానంలో చూపించిన పుస్తకంపై వివాదం నెలకొంది. అయోధ్య రీవిజిటెడ్ పేరుతో మాజీ ఐపీఎస్ అధికారి కిశోర్ రాసిన పుస్తకాన్ని హిందూ మహాసభ న్యాయవాది వికాస్ సింగ్‌ కోర్టు ముందుంచారు. ఈ పుస్తకాన్ని ముస్లిం సంస్థల తరపు న్యాయవాది రాజీవ్‌ ధావన్‌ చించివేయడంతో గందరగోళం ఏర్పడింది. 1986లో ముద్రించిన ఈ పుస్తకాన్ని రికార్డుల్లోకి తీసుకోవద్దంటూ ధావన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే పుస్తకాన్ని, మ్యాప్‌ను చింపిన సున్నీ వక్ఫ్ బోర్డ్ తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అసహనం వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే కోర్టు నుంచి వెళ్లిపోతామని ప్రధాన న్యాయమూర్తి హెచ్చరించారు. ఓ దశలో న్యాయవాదులకు, ప్రధాన న్యాయమూర్తి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మరోవైపు అయోధ్య వివాదంపై నేడు వాదనలు ముగియనుండటంతో సుప్రీం కోర్టు వెల్లడించే తుదితీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top