భార్య తాకట్టు...హత్య | Haryana quilt maker pledges wife for Rs 30,000, kills money lender when he refuses to release her | Sakshi
Sakshi News home page

భార్య తాకట్టు..హత్య

Nov 19 2015 3:16 PM | Updated on Jul 29 2019 5:43 PM

ముప్పయి వేలకోసం భార్యను తాకట్టుపెట్టాడు హర్యానాలోని ఓ వ్యక్తి. అయితే తీసుకున్న అప్పు చెల్లించినా భార్యను విడుదల చేయడానికి నిరాకరించిన సదరు వ్యక్తిని హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చండీగఢ్:   ఆపదలో వున్నపుడు,   ఆర్థిక అవసరాలకోసం విలువైన వస్తువులను, ఆస్తులను  తాకట్టు పెట్టడం మామూలు విషయమే. కానీ ముప్పయి వేలకోసం భార్యను తాకట్టుపెట్టాడు హర్యానాలోని ఓ వ్యక్తి.  అయితే తీసుకున్న అప్పు చెల్లించినా భార్యను విడుదల చేయడానికి నిరాకరించిన    సదరు వ్యక్తిని  హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్థానిక  పోలీసులు ఉన్నతాధికారుల కథనం ప్రకారం  సల్మాను సబ్బీర్  ఇద్దరూ  పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవారు.   కొంతకాలం క్రితం హరియాణా వచ్చిన స్థానికంగా ఒకఫ్యాక్టరీలో పనిచేసుకుంటూ పొట్ట పొసుకుంటున్నారు.  వీరికి  ముగ్గురు పిల్లలు.    బొంతలు కుట్టి అమ్ముకునే గోలం, సబ్బీర్ దంపతులు పక్క పక్కనే ఉండేవారు. ఈ క్రమంలో గోలం దగ్గర  భార్య సల్మాను తాకట్టుపెట్టాడు సబ్బీర్ .  కొంతకాలానికి ఎలాగోలా కష్టపడి ఆ అప్పును తీర్చేశాడు.  కానీ సల్మాను  విడిచిపెట్టడానికి  గోలం నిరాకరించడంతో పాటుగా మరింత డబ్బు కావాలని డిమాండ్ చేశాడు.  దీనిపై  నిలదీయడానికి అతని స్నేహితులు అక్తర్, గౌరవ్ తో కలిసి గోలం నివాసానికి వెళ్లాడు. అక్కడ ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. ఈ క్రమంలోనే గోలంను హత్యచేసి సమీపంలోని పొదల్లో పడేసి వెళ్లిపోయారని డిఎస్పీ రాజేంద్ర కుమార్ తెలిపారు

అక్టోబర్  31న హత్య జరిగితే  నవంబర్ 1 న తేదీన ఈ విషయం  వెలుగులోకి వచ్చింది.   స్థానిక యమునానగర్ ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.  ఈ  మృతదేహం  ఆచూకీ కోసం ఆరాతీయగా బొంతలు తయారు చేసుకొనే గోలందిగా స్థానికులు  గుర్తించారు.   హత్యకేసుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన  పోలీసులు  ఎట్టకేలకు గత ఆదివారం ఛేదించారు.   అనుమానాస్పద వ్యక్తులుగా  సబ్బీర్, సల్మా దంపతులను అదుపులోకి  ప్రశ్నించగా, నేరాన్ని అంగీకరించారు.

అయితే  గోలం ను హత్యచేసిన విషయాన్ని అతని  బంధువులకు సమాచారం అందించినట్టు  సల్మా పోలీసులతో చెప్పింది.  ఈ విషయాన్ని   గోలం బంధువు ఆలం  కూడా ధృవీకరించారు.      వారి మధ్య జరిగిన  లావేదేవీల గురించి తనకు తెలియదు గానీ, గోలందగ్గర పాటుగా సల్మా నాలుగు ఉన్నట్టు అంగీకరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement