అక్కడ మహిళలకు జీన్స్‌, మొబైల్‌ నిషిద్ధం | Haryana Panchayat Bans Girls From Wearing Jeans | Sakshi
Sakshi News home page

అక్కడ మహిళలకు జీన్స్‌, మొబైల్‌ నిషిద్ధం

Apr 18 2018 3:13 PM | Updated on Apr 18 2018 3:13 PM

Haryana Panchayat Bans Girls From Wearing Jeans - Sakshi

సాక్షి, ఛండీగర్‌ : మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళుతుంటే పలు రూపాల్లో వివక్ష వారిని వెంటాడుతూనే ఉంది. యువతులు జీన్స్‌ ధరించరాదని, మొబైల్‌ ఫోన్లు వాడరాదని హర్యానాలోని ఓ గ్రామ పంచాయితీ నిర్ణయం తీసుకుంది. సోనిపట్‌ సమీపంలోని ఇసీపూర్‌ ఖేదీ గ్రామ పంచాయితీ ఈ మేరకు తీర్మానించింది. గ్రామ పెద్దల నిర్ణయంపై యువతులు సహా పలువురు తీవ్రస్ధాయిలో మండిపడుతున్నారు.

‘తామేం ధరించాలన్నది సమస్య కాదని..పురుషుల మనస్తత్వంతోనే ఇబ్బందులు ఎదురవుతున్నా’యని గ్రామంలోని యువతులు చెబుతున్నారు. వేసుకున్న దుస్తుల ప్రకారం ఓ మహిళ వ్యక్తిత్వాన్ని ఎలా నిర్ధారిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో రాజస్ధాన్‌లోనూ గత ఏడాది జులై 27న ధోల్‌పూర్‌ జిల్లాలోని ఓ పంచాయితీ యువతులు జీన్స్‌ వేసుకోరాదని, మొబైల్‌ ఫోన్లు వాడరాదని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన రాజస్థాన్‌ మహిళా కమిషన్‌ విచారణకు ఆదేశించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement