‘పటేళ్లకు రిజర్వేషన్లపై 24 గంటల్లో తేల్చండి’

Hardik Patel Group Delivers New Ultimatum To Congress - Sakshi

గాంధీనగర్‌: గుజరాత్‌లో అధికారంలోకి వస్తే పటేల్‌ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తారో లేదో 24 గంటల్లోగా తేల్చి చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీకి పాస్‌ (పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి) గడువు విధించింది. పాస్‌ నేతలతో ఢిల్లీలో గుజరాత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు భరత్‌ సిన్హ్‌ తొలుత స్వల్పకాలంపాటు భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అయిన తర్వాత మళ్లీ మాట్లాడతామని చెప్పి ఆయన వెళ్లిపోయారు.

పాస్‌ నేత దినేశ్‌ బమానియా మాట్లాడుతూ ‘సమావేశం అయిపోయినా ఆయన మమ్మల్ని కలవలేదు. మేం ఫోన్‌ చేస్తున్నా స్పందించలేదు. ఇది మాకు అవమానం’ అని అన్నారు. దీంతో రిజర్వేషన్ల అంశంపై 24 గంటల్లోగా తేల్చి చెప్పాలని దినేశ్‌ కాంగ్రెస్‌ వారికి కరాఖండిగా చెప్పినట్లు సమాచారం. మరోవైపు పాస్‌ నేత హర్దిక్‌ పటేల్‌ మాజీ సన్నిహితులు ఇద్దరు తాజాగా కాషాయ కండువా కప్పుకున్నారు. గతేడాది ఆగస్టులో పాస్‌ నుంచి బహిష్కరణకు గురైన కేతన్‌ పటేల్, అమరేశ్‌ పటేల్‌లు శనివారం బీజేపీలో చేరారు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top