మహిళను వేధించినందుకు రోడ్లూడ్చే శిక్ష | Harassing a woman sentenced to clean roads | Sakshi
Sakshi News home page

మహిళను వేధించినందుకు రోడ్లూడ్చే శిక్ష

Jan 12 2016 10:35 AM | Updated on Jul 23 2018 9:13 PM

మహిళ పై అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తులకు ఆరె నెలల పాటు రోడ్లూడ్చే శిక్ష విధించింది ముబై కోర్టు.

ఆదివారం ఉదయం మహరాష్ట్ర లోని థానేలో నలుగురు యువకులు చీపుర్లు పట్టుకుని రోడ్లు ఊడ్చారు. అలా ఒకటి కాదు... రెండు కాదు.. ఏకంగా ఏడు గంటల పాటు..చమటోడ్చి థానే రోడ్లను శుభ్రం చేశారు. వీళ్లంతా  స్వచ్ఛ భారత్ లో భాగంగా ఇలా చేశారనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఓ మహిళను.. వేధించినందుకు పడిన శిక్ష ఇది.

గత ఏడాది దసరా ఉత్సవాల సందర్భంగా స్థానికంగా నివాసం ఉంటున్న అంకిత్ జాదవ్, సుహాస్ ఠాగూర్, మిలింద్ మోర్, అమిత్ లు పూటుగా తాగారు. అటుగా వెళుతున్న ఓ యువతిపై లైగిక వేధింపులకు దిగారు. ఇది గమనించిన ఓ యువకుడు వీరిని అడ్డుకోడానికి ప్రయత్నించగా.. ఇనప రాడ్ తీసుకుని అతడిని చితక బాదారు. అడ్డుకోడానికి ప్రయత్నించిన వారందరినీ వేధించారు. దీంతో వీరిపై కేసు నమోదైంది.

అయితే..నిందితులు.. బాధితులతో కోర్టు బయట కేసు సెటిల్ చేసుకున్నారు. ఈవిషయాన్ని బాధితులు కోర్టులో ధృవ పరిచారు. దీంతో తమ కేసును క్వాష్ చేయాలంటూ నిందితులు ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు పరిశీలించిన కోర్టు .. నిందితులంతా.. ఆరు నెలల పాటు.. పోలీసుల పర్యవేక్షణలో సమాజ సేవ చేయాల్సిందిగా ఆదేసించింది. అంతే కాదు.. టాటా మెమోరియల్ ఆస్పత్రికి ఒక్కొక్కరూ.. రూ.5000 డొనేషన్ రూపంలో చెల్లించాలని పేర్కొంది.

తమకు పడ్డ  శిక్షపై స్పందించిన నిందితుడు ఠాగూర్ ' మేం తప్పు చేశాం.మళ్లీ ఆ తప్పు చేయం. అంతే కాదు.. మాలాగా తప్పులు చేసేవాళ్లకు మా శిక్ష ఒక గుణ పాఠం కావాలి. మమ్మల్సి చూసి.. ఇలాంటి తప్పు ఎవరూ చేయకుండా భయపడాలి' అని తెలిపాడు. మరో నిందితుడు జాదవ్ స్పందిస్తూ..'మేంచేసి పనికి చింతిస్తున్నాం..ఈ విధంగా దేశానికి సేవ చేసే అవకాశం రావడం సంతోషమే కాని.. మా చర్యలపట్ల  సిగ్గుపడుతున్నామని అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement