కోటా కోసం మళ్లీ గుజ్జర్ల ఆందోళన | Sakshi
Sakshi News home page

కోటా కోసం మళ్లీ గుజ్జర్ల ఆందోళన

Published Fri, Feb 8 2019 8:00 PM

Gujjars Relaunch Quota Agitation In Rajasthan - Sakshi

జైపూర్‌ : రాజస్ధాన్‌లో గుజ్జర్లు రిజర్వేషన్‌ కోరుతూ మళ్లీ ఆందోళన బాట పట్టారు. విద్యా, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు డిమాండ్‌ చేస్తూ శుక్రవారం సవాయి మధోపూర్‌ జిల్లాలో ఆందోళనకారులు రైల్వే ట్రాక్‌లపై కూర్చుని రైళ్ల రాకపోకలను అడ్డగించారు. ఐదు శాతం రిజర్వేషన్‌ కోసం తాము చాలా కాలంగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తాము తిరిగి ఆందోళన చేపట్టామని, తమ కోటాను ప్రభుత్వం ఎలాగైనా ఇచ్చి తీరాల్సిందేనని గుజ్జర్ల నేత కిరోరి సింగ్‌ భైంస్లా డిమాండ్‌ చేశారు.

ప్రస్తుతం గుజ్జర్లు, రైకా-రెబరి, బంజారాలకు 50 శాతం కోటాలోనే అత్యంత వెనుకబడిన వర్గాల కింద ప్రత్యేకంగా ఒక శాతం రిజర్వేషన్‌ అమలవుతోంది. అయితే తమ కులాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్ధల్లో ఐదు శాతం రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ గుజ్జర్లు జనవరిలో రాజస్ధాన్‌ ప్రభుత్వానికి 20 రోజుల గడువిస్తూ అల్టిమేటం జారీ చేశారు. డెడ్‌లైన్‌ ముగియడంతో సవాయి మధోపూర్‌ జిల్లాలో గుజ్జర్లు మహాపంచాయత్‌ పేరిట భేటీ అయి ఆందోళన చేపట్టారు. 

Advertisement
Advertisement