పద్మ అవార్డులకు నామినేషన్ల వెల్లువ

Government gets over 16000 Nominations for Padma Awards 2020 - Sakshi

న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఇచ్చే ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల కోసం 16 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 2020లో ఈ పురస్కారాలను ప్రకటించనున్నారు. ఈ అవార్డులు అందుకోవడానికి కులం, మతం, స్థాయి, లింగ బేధాలు ఉండవని తెలిపారు. అయితే ప్రభుత్వోద్యోగాలు చేసేవారిలో కేవలం వైద్యులు, సైంటిస్టులు మాత్రమే ఈ అవార్డు పొందడానికి అర్హులు. కేవలం పద్మ అవార్డ్స్‌ పోర్టల్‌లో మాత్రమే దీనికి సంబంధించిన దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 15తో నామినేషన్‌ ప్రక్రియ ముగుస్తుంది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top