రాకేష్‌ ఆస్ధానాపై బదిలీ వేటు | Government  Removed CBI Special Director Rakesh Asthana | Sakshi
Sakshi News home page

రాకేష్‌ ఆస్ధానాపై బదిలీ వేటు

Jan 17 2019 8:59 PM | Updated on Jan 17 2019 9:02 PM

Government  Removed CBI Special Director Rakesh Asthana - Sakshi

రాకేష్‌ ఆస్ధానాపై వేటు : సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ విభాగానికి బదిలీ

సాక్షి, న్యూఢిల్లీ : అత్యున్నత దర్యాప్తు ఏజెన్సీ సీబీఐలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్న సీబీఐ చీఫ్‌ ఆలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్ధానాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆలోక్‌ వర్మను సీబీఐ చీఫ్‌గా తొలగించిన ప్రభుత్వం  ఫైర్‌ సర్వీసుల డీజీగా పంపడంతో మనస్ధాపం చెందిన ఆలోక్‌ ప్రభుత్వ సర్వీసు నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే.

తాజాగా సీబీఐలో నెంబర్‌ టూగా ఉన్నరాకేష్ ఆస్థానాను దర్యాప్తు ఏజెన్సీ నుంచి ప్రభుత్వం తప్పించింది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ విభాగానికి ఆయనను బదలీ చేసింది. కాగా తనపై నమోదైన అవినీతి కేసుపై ఆస్థానా హైకోర్టుకు వెళ్లినా ఆయనకు ఊరట లభించలేదు.ఆలోక్‌ వర్మ పదవీ విరమణ చేసిన నాలుగు రోజులకే ఆస్ధానాపై బదిలీ వేటు పడింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement