యాత్రా వాహనంపై భారీ వృక్షం పడి.. | four Pilgrims died as Tree Falls on Vehicle in Haryana | Sakshi
Sakshi News home page

యాత్రా వాహనంపై భారీ వృక్షం పడి..

Aug 24 2016 11:40 AM | Updated on Apr 3 2019 7:53 PM

దైవ దర్శనానికి వెళుతున్న వారి ప్రయాణం విషాదంగా మారింది.

హిసార్(హర్యానా): దైవ దర్శనానికి వెళుతున్న వారి ప్రయాణం విషాదంగా మారింది. వారు వెళుతున్న వాహనంపై ఓ భారీ వృక్షం పడటంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలుకోల్పోగా 20మందికి పైగా తీవ్రగాయాలపాలయ్యారు.

వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. పంజాబ్ లోని సంగరూర్ కు చెందిన కొంత 50మంది యాత్రికులు రాజస్థాన్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన గోగామేరికి బయలుదేరారు. అలా వెళుతున్న క్రమంలో వారి వాహనం హర్యానాలోని కోహ్లీ అనే గ్రామం వద్దకు చేరుకోగానే అక్కడ రోడ్డుపక్కనే ఉన్న ఓ భారీ వృక్షం అమాంతం దానిపై పడింది. దీంతో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement