ఉదయాన్నే టీ తాగి నలుగురు మృతి | Four members of a family died after consuming poisonous tea in UP | Sakshi
Sakshi News home page

ఉదయాన్నే టీ తాగి నలుగురు మృతి

Aug 3 2016 4:17 PM | Updated on Sep 28 2018 3:41 PM

ఉదయాన్నే టీ తాగి నలుగురు మృతి - Sakshi

ఉదయాన్నే టీ తాగి నలుగురు మృతి

టీ తాగి నలుగురు వ్యక్తులు కుప్పకూలారు. అది విషపూరితం కావడంతో వారంతా ప్రాణాలుకోల్పోయారు.

కాన్పూర్: టీ తాగి నలుగురు వ్యక్తులు కుప్పకూలారు. అది విషపూరితం కావడంతో వారంతా ప్రాణాలుకోల్పోయారు. సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం కాన్పూర్ కు సమీపంలోని అమృత్ పూర్ అనే గ్రామంలో రాణి(32) అనే ఓ గృహిణి ఉదయాన్నే నిద్రలేచి టీ తయారు చేసింది.

తన ముగ్గురు పిల్లలు మన్సి(8), ఉపాసన(3), కనహియ(7) కు ఆ టీ పోసి తాను తాగింది. అయితే, విషపూరితంగా మారడంతో వారు నలుగురు చనిపోయారు. ఆమె భర్త ఢిల్లీలో పనిచేస్తుంటాడు. ఈ ఘటన తమను తీవ్రంగా బాధించిందని, టీ విషపూరితం కావడం వల్లే వారు చనిపోయారనే ప్రాథమికంగా తెలుస్తోందని, శవపరీక్ష నివేదిక వచ్చాక అన్ని విషయాలు తెలుస్తాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement