నిందితుడిపై రూ. 5 లక్షల రివార్డు : సీబీఐ

Five Lakh Rupees Reward For Information on Rape Suspect Announced By Probe Agency - Sakshi

న్యూఢిల్లీ : తన ఆశ్రమంలో మహిళలు, బాలికలను బంధించి, అత్యాచారానికి పాల్పడ్డ దొంగ బాబా ఆచూకీ తెలిపిన వారికి నజరానా అందజేస్తామని సీబీఐ తెలిపింది. ఈ మేరకు అతడిని పట్టించిన వారికి రూ. 5 లక్షల భారీ రివార్డు ప్రకటించింది. వివరాలు.. తనను తాను భగవంతుడిగా చెప్పుకొనే వీరేందర్‌ దేవ్‌ దీక్షిత్‌(77) ఢిల్లీలోని రోహిణి సమీపంలో ఆశ్రమం నడిపించేవాడు. ఈ క్రమంలో ప్రవచనాలు వినేందుకు మహిళలు, బాలికలు అక్కడికి వచ్చేవారు. మాయమాటలు చెప్పి వీరిని బంధించిన వీరేందర్‌..ఆశ్రమంలోనే అకృత్యాలకు పాల్పడేవాడు. ఇతడి ఆగడాలను ఓ గమనించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి  2017 డిసెంబరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఢిల్లీ హైకోర్టు ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది.

దారుణంగా హింసించేవాడు...
తన ఆశ్రమానికి వచ్చే బాలికలు, మహిళలనుదారుణంగా హింసించేవాడని సీబీఐ పేర్కొంది. జంతువుల్లా వాళ్లను పంజరాల్లో బంధించి అత్యాచారానికి పాల్పడే వాడని తెలిపింది. అయితే కేసు నమోదైన నాటి నుంచి అతడు పరారీలో ఉండటం.. నేపాల్‌కు పారిపోయాడనే సమాచారంతో గతేడాది జనవరి 22, ఫిబ్రవరి 22, 2019లో రెండుసార్లు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసింది. అదే విధంగా ఇంటర్‌పోల్‌ను కూడా ఆశ్రయించింది. కానీ ఇంతవరకు అతడి ఆచూకీ మాత్రం తెలియరాలేదు. ఈ క్రమంలో తాజాగా వీరేందర్‌ను పట్టించిన వారికి ఐదు లక్షల రూపాయల బహుమానమిస్తామని ప్రకటించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top