వినాయకనిమజ్జన విషాదం: విద్యుత్షాక్కు అయిదుగురి మృతి | Five electrocuted, four sustain burns | Sakshi
Sakshi News home page

వినాయకనిమజ్జన విషాదం: విద్యుత్షాక్కు అయిదుగురి మృతి

Sep 14 2014 6:57 PM | Updated on Sep 2 2017 1:22 PM

వినాయకుడిని నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా విషాదం నెలకొంది. విద్యుదాఘాతానికి అయిదుగురు దుర్మరణం చెందాడు.

దొడ్డబళ్లాపుర(కర్ణాటక): వినాయకుడిని నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా విషాదం నెలకొంది. విద్యుదాఘాతానికి అయిదుగురు దుర్మరణం చెందారు. దొడ్డబళ్లాపుర తాలూకా మధురె కనకవాడి గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. గ్రామస్తులు గణేశుని విగ్రహం నిమజ్జనం చేయడానికి సమీపంలోని కాలువ వద్దకు వెళ్లారు.

వినాయక నిమజ్జనం తరువాత తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్కు తెగిపడి ఉన్న విద్యుత్ హైటెన్షన్ వైరు  తగిలింది. దాంతో విద్యుత్ షాక్కు అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురుకి కాలిన తీవ్ర గాయాలయ్యాయి. చాలా మంది ట్రాక్టర్పై నుంచి కిందకు దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement