హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం | Sakshi
Sakshi News home page

ఇండోర్‌ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం

Published Mon, Oct 21 2019 12:07 PM

Fire Breaks Out At Hotel In Indore - Sakshi

ఇండోర్‌ : మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్‌లోని గోల్డెన్‌ హోటల్‌లో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో అతిధులు, సిబ్బంది సహా ఎంతమంది లోపల ఉన్నారనేది తెలియరాలేదు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన అగ్నిమాపక యంత్రాలను రప్పించి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. హోటల్‌లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువస్తున్నారు. అగ్నిప్రమాదానికి కారణాలేమిటనేది ఇంకా వెల్లడికాలేదని అధికారులు తెలిపారు. హోటల్‌ ముందుభాగంలో మంటలు చెలరేగడంతో పాటు ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ ఆవరించింది. మరోవైపు మహారాష్ట్రలోని భివాండిలోనూ ఓ వేర్‌హౌస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడకు చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.   

Advertisement
 
Advertisement