పోకిరీని చితక్కొట్టి.. ఫేస్బుక్లో వీడియో!! | eve teaser beaten by woman, shares video in facebook | Sakshi
Sakshi News home page

పోకిరీని చితక్కొట్టి.. ఫేస్బుక్లో వీడియో!!

Aug 11 2014 3:59 PM | Updated on Jul 11 2019 8:06 PM

పోకిరీని చితక్కొట్టి.. ఫేస్బుక్లో వీడియో!! - Sakshi

పోకిరీని చితక్కొట్టి.. ఫేస్బుక్లో వీడియో!!

మహిళలను వేధిస్తున్న పోకిరీలకు బెంగళూరులో ఓ మహిళ గట్టిగా బుద్ధి చెప్పింది.

మహిళలను వేధిస్తున్న పోకిరీలకు బెంగళూరులో ఓ మహిళ గట్టిగా బుద్ధి చెప్పింది. వెనకనుంచి కామెంట్ చేస్తున్న ఆ వ్యక్తిని చూసీ చూడనట్లు వదిలేయకుండా.. వెంటపడి, తరిమి తరిమి పట్టుకుని కొట్టింది. ముందుగా అతడిని మోకాళ్లమీద వంగి కూర్చోమని ఆదేశించి.. ఆ తర్వాత కొట్టారు. ఈ మొత్తం విషయాన్ని ఆమె స్నేహితురాలు ఫోన్లో వీడియో తీయగా, ఆ వీడియోను సదరు మహిళ ఫేస్బుక్లో కూడా షేర్ చేసింది.

తాను రోజూలాగే పార్కులో ఉదయం జాగింగ్కు వెళ్లినప్పుడు ఓ వ్యక్తి తనను వెంటపడి వేధించాడని, తాను అతడిని తరిమి పట్టుకుని కొట్టానని, అంతేకాక అతడిమీద పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు. పోలీసులు కూడా చాలా సానుకూలంగా స్పందించారని చెప్పారు. మనం మారాలనుకుంటే మార్పు దానంతట అదే వస్తుందని చెప్పడానికే తానీ వీడియో పెడుతున్నానని, మహిళలు పారిపోకుండా పోకిరీలకు గట్టిగా గుణపాఠం చెప్పాలని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement