నకిలీ ఐడీతో ఇమ్రాన్‌ను బీజేపీలో చేర్చిన వ్యక్తి అరెస్ట్‌

Enrols Imran In BJP Lands In Jail - Sakshi

అహ్మదాబాద్‌ : నకిలీ ఐడీలతో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌, డేరా బాబా, ఆశారాం బాపూలను బీజేపీ సభ్యులుగా చూపిన వ్యక్తిని అహ్మదాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ వ్యవహారం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడు షాపూర్‌కు చెందిన గులాం ఫరీద్‌ షేక్‌ను అరెస్ట్‌ చేశారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టిన నేపథ్యంలో షేక్‌ ఈ నిర్వాకానికి ఒడిగట్టాడు. నరేంద్రమోదీ.ఇన్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఎవరైనా ఓ నిర్ధిష్ట నెంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వడం ద్వారా చేరే వెసులుబాటు ఉంది.

ఇలా చేరిన వారికి వారి పేరుతో వర్చువల్‌ బీజేపీ సభ్యత‍్వ ఐడీ, ఫోటోతో సహా సిస్టమ్‌లో జనరేట్‌ అవుతుంది. కాగా ఫేక్‌ ఐడీలతో పాకిస్తాన్‌ ప్రధానితో పాటు, రాం రహీం సింగ్‌, ఆశారామ్‌ బాపూలను బీజేపీ సభ్యులుగా చూపుతూ ఆ ఫోటోలను షేక్‌ షాపూర్‌ ఏక్తా సమితి అనే వాట్సాప్‌ గ్రూప్‌లో షేర్‌ చేశారు. షేక్‌కు ఫేక్‌ ఐడీల తయారీలో సహకరించిన వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని అహ్మదాబాద్‌ పోలీసులు వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top