ఆ నివేదికపై నిర్మలా సీతారామన్‌ నో కామెంట్‌ | Didn’t mention CAG report, stop putting words in mouth, says Nirmala Sitharaman | Sakshi
Sakshi News home page

ఆ నివేదికపై నిర్మలా సీతారామన్‌ నో కామెంట్‌

Sep 11 2017 4:47 PM | Updated on Oct 17 2018 5:55 PM

ఆ నివేదికపై నిర్మలా సీతారామన్‌ నో కామెంట్‌ - Sakshi

ఆ నివేదికపై నిర్మలా సీతారామన్‌ నో కామెంట్‌

భారత సాయుధ దళాల వద్ద తగినంత సాయుధ సంపత్తి లేదని, యుద్ధం వస్తే 20 రోజుల వరకే ఇవి సరిపోతాయన్న కాగ్‌ నివేదికపై వ్యాఖ్యానించేందుకు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ నిరాకరించారు.

సాక్షి, న్యూఢిల్లీ: భారత సాయుధ దళాల వద్ద తగినంత సాయుధ సంపత్తి లేదని, యుద్ధం వస్తే 20 రోజుల వరకే ఇవి సరిపోతాయన్న కాగ్‌ నివేదికపై వ్యాఖ్యానించేందుకు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ నిరాకరించారు. తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయకున్నా తనకు వాటిని ఆపాదించడం మానుకోవాలని మీడియాను కోరారు. కాగ్‌ నివేదికలో పొందుపరిచిన అంశాలు సత్యదూరమని తాను వ్యాఖ్యానించినట్టు వచ్చిన వార్తలపై ఆమె విస్మయం​ వ్యక్తం చేశారు.
 
నిర్మలా సీతారామన్‌ సోమవారం మీడియాతో మాట్లాడుతూ సాయుధ దళాలకు ఆయుధ సామాగ్రి కొనుగోలు నిరంతర ప్రక్రియ అన్నారు. ఇటీవల తాను కొందరు విలేకరులతో మాట్లాడుతూ ఇవే విషయాలు ప్రస్తావించానని, కాగ్‌ నివేదిక గురించి ఎలాంటి వ్యాఖ్యలూ చేయకపోయినా తప్పుగా రిపోర్ట్‌  చేశారని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement