
సాక్షి, అమృత్‌సర్ : ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ)అధ్యక్షుడిగా దేవులపల్లి అమర్ బాధ్యతలు చేపట్టారు. శని, ఆదివారాలు పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగిన ఐజేయూ 9వ మహాసభలో ఎస్. ఎన్ సిన్హా నుంచి అమర్ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీకి చెందిన సబినా ఇంద్రజిత్ సెక్రెటరీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు. జాతీయ కార్యవర్గానికి ఈరోజు జరిగిన ఎన్నికల్లో తెలంగాణ నుంచి వై. నరేందర్ రెడ్డి కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు.
కార్యవర్గ సభ్యులుగా నగునూరి శేఖర్, కె.సత్యన్నారాయణ ఎన్నికయ్యారు. ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా స్థానిక సంస్థలు, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైన మీడియా స్వతంత్ర్యంగా, నిర్భయంతో పనిచేయాలన్నారు.