breaking news
amruthser conference
-
ఐజేయూ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దేవులపల్లి అమర్
సాక్షి, అమృత్సర్ : ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ)అధ్యక్షుడిగా దేవులపల్లి అమర్ బాధ్యతలు చేపట్టారు. శని, ఆదివారాలు పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగిన ఐజేయూ 9వ మహాసభలో ఎస్. ఎన్ సిన్హా నుంచి అమర్ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీకి చెందిన సబినా ఇంద్రజిత్ సెక్రెటరీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు. జాతీయ కార్యవర్గానికి ఈరోజు జరిగిన ఎన్నికల్లో తెలంగాణ నుంచి వై. నరేందర్ రెడ్డి కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా నగునూరి శేఖర్, కె.సత్యన్నారాయణ ఎన్నికయ్యారు. ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా స్థానిక సంస్థలు, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైన మీడియా స్వతంత్ర్యంగా, నిర్భయంతో పనిచేయాలన్నారు. -
'అమృత్' సదస్సుకు రామగుండం మేయర్
కరీంనగర్: రాజధాని న్యూఢిల్లీలో జరిగే 'అమృత్' సదస్సులో కరీంనగర్ జిల్లాకు చెందిన రామగుండం, జగిత్యాల అధికారులు పాల్గొననున్నారు. ఈ నెల 25, 26 వ తేదీల్లో రాజధానిలో జరిగే సదస్సులో స్మార్ట్‌సిటీలు, అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్) పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కరీంనగర్ జిల్లా రామగుండం కార్పొరేషన్ మేయర్ లక్ష్మీనారాయణ, జగిత్యాల మున్సిపల్ చైర్మన్‌తోపాటు కమిషనర్లు నేడు బయలుదేరనున్నారు.