చిదంబరం సీబీఐ కస్టడీ పొడిగింపు

Delhi Special Court Extend Chidambaram CBI Custody Till Monday - Sakshi

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీల్యాండరింగ్‌ కేసుకు సంబంధించి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సీబీఐ కస్టడీని వచ్చే సోమవారం పొడిగిస్తూ ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే కేసుకు సంబంధించి ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సెప్టెంబర్‌ 5న తీర్పు వెలువరిస్తామని సుప్రీంకోర్టు గురువారం వెల్లడించిన సంగతి తెలిసిందే. చిదంబరాన్ని ఈడీ అరెస్టు చేయకుండా కల్పించిన తాత్కాలిక రక్షణ గడువును వచ్చే గురువారం వరకు పొడిగిస్తునట్టు అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

ఐఎన్‌ఎక్స్‌ మీడియాలో రూ.305 కోట్ల విదేశీ పెట్టుబడుల అవకతవకల్లో 2007లో కేంద్ర మంత్రిగా ఉన్న చిదంబరం పాత్ర ఉందంటూ సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తి చిదంబరం, ఇంద్రాణీ ముఖర్జీలు నిందితులుగా ఉన్నారు. గతేడాది కార్తిని అరెస్ట్‌ చేసిన దర్యాప్తు సంస్థలు 23 రోజుల పాటు కస్టడీలో ఉంచి విచారణ చేపట్టాయి. అయితే ఇటీవల ఇంద్రాణీ అప్రూవర్‌గా మారారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top