రన్‌ వేపై విమానాలు ఢీ | Delhi: Jet Airways flight hits another aircraft before take off, major accident averted | Sakshi
Sakshi News home page

రన్‌ వేపై విమానాలు ఢీ

May 7 2017 4:34 PM | Updated on Oct 2 2018 7:37 PM

రన్‌ వేపై విమానాలు ఢీ - Sakshi

రన్‌ వేపై విమానాలు ఢీ

రన్‌ వేపైకి వెళ్తున్న ఓ విమానం.. పక్కనే ఉన్న మరో విమాన రెక్కకు తగిలింది.

రన్‌ వేపైకి వెళ్తున్న ఓ విమానం.. పక్కనే ఉన్న మరో విమాన రెక్కకు తగిలింది. ఈ ఘటన ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ప్రమాదంలో ప్రయాణీకులకు ఎలాంటి అపాయం జరగలేదు. జెట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన 9డబ్ల్యూ603 విమానం ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు వెళ్లాల్సివుంది. దీంతో విమానాన్ని మరల్చేందుకు పైలట్‌ ప్రయత్నించాడు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న మరో విమానం రెక్కకు జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానం వెనుక భాగం తాకింది. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం ఇంకా తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement