 
													న్యూఢిల్లీ: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌కు విధించిన బెయిల్ షరతులను ఢిల్లీ కోర్టు మంగళవారం సవరించింది. వైద్యకారణాలు, ఎన్నికల ప్రయోజనాల కోసం ఢిల్లీని సందర్శించడానికి కోర్టు అనుమతిస్తున్నట్లు అదనపు సెషన్స్ న్యాయమూర్తి కామిని ఆదేశాలిచ్చారు. చంద్రశేఖర్ ఆజాద్ గత నెలలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక నిరసనల్లో ప్రజలను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై అరెస్టు కాగా.. ఆజాద్‌కు ఢిల్లీలోని స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
చదవండి: జామా మసీదు ముందు భీమ్ ఆర్మీ చీఫ్
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగే నిరసన ప్రదర్శనల్లో పాల్గొనరాదని, నాలుగు వారాల వరకు ఢిల్లీకి రావద్దని ఆయనపై కోర్టు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఆజాద్ తనకు విధించిన బెయిల్ షరతులను సవరించాలని పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు షరతులను సవరించింది. అదే విధంగా ఆజాద్ కార్యాలయం రాజకీయపార్టీకి సంబంధించిందా.. కాదా.. అని ఎన్నికల సంఘం నుంచి నివేదిక తీసుకోవాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.
చదవండి: జామా మసీద్ పాక్‌లో ఉందా..?

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
