
న్యూఢిల్లీ: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలకు ఫాస్టాగ్ గడువును డిసెంబర్ 15 వరకు పొడిగించింది. డిసెంబరు 1 నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్ ఉండాల్సిందేనని ప్రకటించిన కేంద్రం.. తాజాగా గడువు పొడిగించింది. ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా ఈ విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. దీని వల్ల వాహనాలు చెల్లింపుల నిమిత్తం నిలిచి ఉండాల్సిన పనిలేకుండా హైబ్రిడ్ లైన్‌లో వెళ్లిపోవచ్చు. నవంబర్ 21 నుంచి ట్యాగ్ వ్యయంలో వెసులుబాటు ఇచ్చిన దగ్గర నుంచి వీటి వినియోగం గణనీయంగా పెరిగినట్లు ప్రకటించింది.