భారత్‌లో పంజా విసురుతున్న కరోనా | Sakshi
Sakshi News home page

దేశంలో గత 24 గంటల్లో 1718 కరోనా కేసులు

Published Thu, Apr 30 2020 5:22 PM

Coronavirus : 1718 New Cases Registered In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతునే ఉంది. కోవిడ్‌-19 పాజిటివ్ కేసులు సంఖ్యతో పాటు, మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది. గురువారం కేంద్రం విడుదల చేసిన హెల్త్‌ బుటిటెన్‌ ప్రకారం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 33 వేలు దాటింది. గత 24 గంటల్లో భారత్‌లో 1718 కొత్త  కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌అగర్వాల్‌ వెల్లడించారు. దీంతో భారత్‌ మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 33,050కి చేరింది.
(చదవండి : పెళ్లి కోసం తండ్రి, కొడుకులు ఏం చేశారంటే..)

ఇక ఈ మహమ్మారి బారిన పడి 24 గంటల్లో 67 మంది మృతి చెందినట్లు వెల్లడించారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 1074కు చేరింది. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం 25.19గా పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించడం కాస్త ఊరట కలిగించే అంశం. ఇప్పటి వరకు 8,324 మంది కరోనా మహమ్మారి నుంచి కొలుకొని ఇంటికి వెళ్లినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

పేదలకు తక్కువ ధరకే నిత్యావసర సరుకులు
లాక్‌డౌన్‌ సమయంలో కూలీలు, పేదలకు తక్కువ ధరకే నిత్యావసరాలు అందిస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌అగర్వాల్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా హాట్‌స్పాట్‌లను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. లారీ డ్రైవర్లకు స్క్రీనింగ్‌ చేయాలని రాష్ట్రాలను ఆదేశించామని చెప్పారు. కరోనా కట్టడిలో రాష్ట్రాలు అన్ని కేంద్రంతో కలిసి నడవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

Advertisement
Advertisement