ఫోటోగ్యాలరీలో ఆ ఫొటోలా..?

Controversy On Jallianwala Bagh Photo Gallery - Sakshi

అమృత్‌సర్‌: బ్రిటిష్ పాలకులు అమలు చేసిన పైశాచిక విధానాల చరిత్రను నేటి తరం తెలుసుకునే విధంగా జలియన్‌వాలాబాగ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. అందులో భాగంగానే పునరుద్దరించిన ఫొటో గ్యాలరీ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ చిత్రాలు అజంతా ఎల్లోరా గుహలలో చిత్రీకరించిన చిత్రాల మాదిరిగానే ఉంటాయని చెబుతారు. కానీ ఫోటోగ్యాలరీలో ప్రదర్శించిన రెండు అర్ధనగ్న మహిళల చిత్రాలు ప్రస్తుతం వివాదాస్పదమవుతున్నాయి. 

ఈ విషయంపై అంతర్జాతీయ సర్వ్‌కాంబోజ్‌ సమాజ్‌ అధ్యక్షుడు బాబీ కంబోజ్‌ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర యోధులు, సిక్కు గురువుల చిత్రాలు, కలిగి ఉన్న గ్యాలరీలో సెమీ న్యూడ్ మహిళల చిత్రాన్ని అధికారులు ప్రదర్శించడం సిగ్గుచేటు. అయితే, జలియన్ వాలాబాగ్ భారతీయుల తీర్థయాత్ర కేంద్రం కంటే తక్కువ కాదు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన వారికి గౌరవం ఇవ్వడానికి ప్రతిరోజూ వందలాది మంది పాఠశాల పిల్లలు, కుటుంబాలతో సహా సందర్శిస్తారు. ఇలాంటిచోట ఫొటో గ్యాలరీలో అర్ధనగ్న మహిళల చిత్రాల్ని అధికారులు ప్రదర్శించారని మాకు తెలియగానే సిగ్గుచేటుగా భావించాం’ అని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. షాహీద్ ఉధమ్ సింగ్ విగ్రహం ముందు టికెట్లు ఇచ్చే కిటికీ ఏర్పాటు చేయడం ద్వారా అమరవీరులను, గురువులను ట్రస్ట్ అవమానించినట్లు అంతర్జాతీయ సర్వ్ కాంబోజ్ సమాజ్.. ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం, పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న జలియన్‌ వాలాబాగ్ కాంప్లెక్స్ సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటోంది.

ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో, జలియన్ వాలా బాగ్ వద్ద పునరుద్ధరణ పనులు ఫిబ్రవరి 15న ప్రారంభమయ్యాయి. ఈ స్మారకాన్ని సందర్శించడానికి జూలై 31 నుంచి తిరిగి ప్రజలను అనుమతించనున్నారు. కేంద్ర ప్రభుత్వం మొదటి దశలో నిర్మాణ పనులకు రూ. 20కోట్ల రూపాయలను కేటాయించింది. రాజ్యసభ ఎంపీ, జలియన్ వాలా బాగ్ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ ట్రస్టీ స్వైత్‌ మాలిక్ పునర్నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఏప్రిల్‌ 13,1919న జలియన్‌ వాలాబాగ్‌లో జనరల్‌ డయ్యర్‌ ఆదేశాల మేరకు బ్రిటీష్‌ ఇండియా సైన్యం వందల మంది భారత పౌరుల ప్రాణాలను బలితీసుకున్న సంగతి తెలిసిందే. (కరోనా వ్యాక్సిన్‌ : ఎయిమ్స్‌కు గ్రీన్‌ సిగ్నల్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top