నవంబర్‌ 30న ‘భారత్‌ బచావో ర్యాలీ’

Congress Party To Hold Bharat Bachao Rally On November 30 - Sakshi

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ నవబంబర్‌ 30న ‘భారత్‌ బచావో ర్యాలీ’కి పిలుపునిచ్చింది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఈ కార్యక్రమం జరుగనుంది. దీంతోపాటు కేంద్రం వైఫల్యాలను ఎత్తిచూపుతూ నవంబర్‌ 5 నుంచి 25 వరకు దేశావ్యాప్తంగా నిరసనలు చేపట్టనుంది. జిల్లా, రాష్ట్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ నిరసనలు చేపడుతామని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ అన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఈ ర్యాలీకి ‘భారత్‌ బచావో ర్యాలీ’ అని పేరు పెట్టినట్టు తెలిపారు. ఎన్డీయే  పాలనలో ఆర్థిక మందగమనం, రైతుల అవస్థలు, నిరుద్యోగిత కొనసాగుతోందని విమర్శించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top