
టోల్ ట్యాక్స్ రద్దు గడువు పొడిగింపు
డిసెంబర్ 2 వరకు ట్యాక్స్ రద్దును పొడిగిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ : రూ.500, 1000 నోట్లు రద్దుతో తలెత్తిన సమస్యలు ఇంకా కొనసాగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై టోల్ ట్యాక్స్ రద్దు గడువును పొడిగించింది. దేశవ్యాప్తంగా డిసెంబర్ 2 వరకు ట్యాక్స్ రద్దును పొడిగిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. టోల్‌ప్లాజాల వద్ద డిసెంబర్ 15 వరకు పాత రూ.500 నోట్లను అంగీకరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది.
నవంబర్ 8వ తేదీ నోట్ల రద్దు ప్రకటించిన తర్వాత టోల్‌ప్లాజాల వద్ద రెండు రోజుల పాటు పాత నోట్లను అంగీకరించారు. అనంతర పరిణామాలతో 24 వరకు టోల్ ట్యాక్స్ రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ రద్దును తాజాగా మరో వారం రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో వాహనదారులకు ఊరట లభించింది.