సంబరాల్లో మునిగితేలుతున్నకార్యకర్తలు | Celebrations of BJP cadre on PM Modi's Council of Minister | Sakshi
Sakshi News home page

సంబరాల్లో మునిగితేలుతున్నకార్యకర్తలు

Jul 5 2016 12:42 PM | Updated on Mar 29 2019 9:12 PM

సంబరాల్లో మునిగితేలుతున్నకార్యకర్తలు - Sakshi

సంబరాల్లో మునిగితేలుతున్నకార్యకర్తలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంత్రి వర్గ విస్తరణలో మంత్రి పదవులు దక్కించుకున్న రాష్ట్రాలు సంతోషంలో మునిగి తేలుతున్నాయి.


న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంత్రి వర్గ విస్తరణలో మంత్రి పదవులు దక్కించుకున్న రాష్ట్రాలు సంతోషంలో మునిగి తేలుతున్నాయి.  ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ లలో  బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.   కేంద్ర క్యాబినెట్ లో బెర్త్ ఖాయం చేసుకున్న రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, అసోం రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

లక్నోలో కార్యకర్తలు ఆనందంతో   ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు.    భోపాల్  నగరంలో  బీజేపీ కార్యకర్తలు  ఉత్సాహంగా నృత్యాలు చేశారు. స్వీట్లు పంచుకున్నారు.  మంత్రి పదవి దక్కించుకున్న అనిల్ దావే ఇంటి దగ్గర  సంబరాలు నెలకొన్నాయి. ఆయన  ప్రమాణ  స్వీకారం అనంతరం  బీజీపీ కార్యకర్తలు పరస్పరం స్వీట్లు తినిపించుకున్నారు.  

కాగా  కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ప్రధాని 19 మంది కొత్తవారికి  తమ క్యాబినెట్ లో చోటు  కల్పించారు.  ఈ విస్తరణలో రాజస్థాన్ కు పెద్దపీట వేసిన  కేంద్రం నలుగురికి అవకాశం కల్పించింది. అలాగే  వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ  విస్తరణలో యూపీ లో ముగ్గురికి  స్థానం కల్పించారు.   ఇందులో ఇద్దరు మహిళలు కావడం  విశేషం.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement